Sunday, May 11, 2014

Tarodayam - 1

తారోదయం
(1)

జీవితం ఎప్పుడు ఎవరికీ ఏ పాఠం నేర్పుతుందో తెలియదు. ఆ పాఠం నేర్పేటప్పుడు ఏమి అనిపించక పోయిన ,అయ్యాక ఫలితం ఇచ్చేముందు చాలా చేదు గా అనిపిస్తుంది. తారువాత వచ్చే తీపిని సరిగ్గా అనుభవించేలా చేసేందుకు జీవితం ఎంచుకున్న దారి ఇది. కాని ఆ చేదు ని భరించలేక చాలా మంది మధ్యలో ఏదైనా తీపి పదార్ధం తినేస్తారు. అలాంటి వాళ్ళకి జీవితం ఇంకొంచెం కఠీనంగా,ఒక డిప్పకాయ కొట్టి మరీ పాఠం మళ్ళి చెప్తుంది. చేదు తట్టుకోలేక ఆ చిన్ని తీపి పదార్ధాన్ని ని రుచి చుస్తే చివరికి కధ కంచికి వెళ్ళినా మధ్యలో అష్ట కష్టాలు పడవలిసి వస్తుంది. చిన్నపటి నించి చేదు రుచి ఎరగని గౌతమ్ కూడా అలా మొదటిసారి పాఠం చెప్పించుకున్నాక తట్టుకోలేక చేతికందిన పంచదారని నోట్లో వేసుకుని ఆ క్షణం తారాస్థాయి లో ఆనందప్పడ్డా, తరువాత చేదు దిగేదాకా చింతించాల్సి వచ్చింది. చివరికి చేదు దిగుతుందో లేదో తెలియని ఒక సందిగ్దం లో పడి ఇంకా తికమక పడుతున్నాడు.

ప్రకృతిని ,జీవితాన్ని కలిపి ఆస్వాదించటం చాలా తక్కువ మందికి ఉండే గొప్ప కళ. అలా ఆస్వాదించగలిగే వాళ్ళు ప్రతి రోజు ని ,రాత్రి ని అందరు చూడలేని ఒక వింత కోణం లో చుడగలరు. ఆ ఆనందం వాళ్ళకే సొంతం. వాళ్ళు మామూలు మనుష్యులతో కలిసి మెలగటం కష్టం. సూర్యాస్తమయం అందరికి ఆ రోజుకి అంతం లా కనపడితే , కొంతమందికి తరువాత కొన్ని గంటలలో ప్రారంబమయ్యే అద్బుతమైన అందాలకి శ్రీకారం. రాత్రిపూట ఆకాశాన్ని చూడకుండా ఉండలేని వాళ్ళలో గౌతమ్ మొదటివాడు. మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల్లన్నా,మబ్బుల చాటున దగుడుమూతలడుతున్న చందమామన్నా కళ్ళు రెప్ప వెయ్యకుండా చూస్తాడు. కొన్నిసార్లు మన వింత అలవాట్లు వింత అనుబుతిని మిగిల్చి, మరి కొన్ని సార్లు అంట కంటే వింత మనుష్యులనిపరిచయం చేస్తాయి.ఎన్నో కొత్త అందాల్ని మన చెంత చేరుస్తాయి,జీవితాన్ని మరింత అందం గా చేకూరుస్తాయి. ముంబై లో గౌతమ్ గడిపిన కాలం అలాంటిది . జీవితం గౌతమ్ కి పాఠం చెప్పాలి అనుకున్న కాలం కూడా అదే.

ఈ లోపు ప్రస్తుతానికి గౌతమ్ రెప్ప వాల్చకుండా చెన్నై బెసంట్ నగర్ బీచ్ దగ్గర కాలం గడుపుతున్న రోజులలో .....

అప్పుడే పక్షులు నిద్రలోంచి లేచి కూని రాగాలు తీస్తున్నాయి. ప్రపంచం ఇంకా ఒళ్ళు మరచి నిద్రపోయే సమయం అది.ఏ మాత్రం గోల లేకుండా చక్కటి హాయి ని ప్రశాంతత ని కలిగించే సమయం.ఏ వాహనం శబ్దం ఉండదు, అమ్మకాల వాళ్ళ గోల ఉండదు, అన్నిటిని మించి చిందరవందర మనసులు ఉండే మనుష్యుల గోల అస్సలు ఉండదు.తను ఎప్పుడు కూర్చునే సముద్రపు ఒడ్డు మీద కూర్చుని నుంచి అప్పుడే అస్తమిస్తున్న చంద్రున్ని చూస్తున్నాడు. ఇంకో పౌర్ణమి దగ్గరకి వస్తోంది. పౌర్ణమి అంటే గుండెల్లో ఎనలేని బాధ  పడతాడు గౌతమ్. కొన్ని నెలలు గా తను కొత్తగా వచ్చిన ఉళ్ళో ఎన్నో కొత్త సంగతులు తెలుసుకుని, వింత అనుభవాలు పొంది  చాల కొత్త మనిషిలా తయారు అయినా పాత జ్ఞ్యపకాలు కొన్ని వెంటాడుతూనే ఉన్నాయి,అందులో పౌర్ణమి ఒకటి. పడమరన అంతకంతకు కిందకి దిగుతున్న చంద్రున్ని చూస్తూ తన గుండెల్లో తార మిగిల్చిన తీపి గుర్తులను అంతకంతకు దిగమింగుతున్నాడు.

తూర్పున ఈ లోపు నేనున్నాను అని వస్తున్నా సూర్యున్ని చూసి ఎదో కొత్త ఆశ కలిగినా చంద్రున్ని చూసి తనకి తలియకుండా వచ్చిన కన్నీటి బొట్టుని తుడుచుకుని నవ్వుకుంటూ , ఆ రోజుకి విశ్రమించటానికి అడుగు ముందుకు కదిపాడు. అమ్మవారి గుడి లో హారతి అయ్యాక గంటలు మోగాయి , వీధులు జనాలతో నిండాయి, పిల్లలు పాఠశాలలకి వెళ్తున్నారు, వాహనాలు గోల చేస్తూ తిరుగుతున్నాయి, యధావిధి గా గౌతమ్ కళ్ళు మూత పడ్డాయి.

అంతకు కొన్నేళ్ళ ముందు చించినాడ అనే పల్లెటూరు లో .....

ఆకాశం అన్నా,నక్షత్రాలన్న అన్నిటిని మించి చంద్రుడు అన్నా గౌతమ్ కి అమితమైన ఇష్టం. చిన్ననాటి నుంచి రాత్రిళ్ళు  ఎక్కువ సమయం వాళ్ళ ఇంటి బైట పెరడు లో గడపడం వాళ్ళ రాత్రిపూట ఆకాశానికి తనకి విడదీయలేని సంబంధం ఏర్పడింది. అమ్మ పక్కనే పడుకున్నా, పిల్లి లా నక్కి నక్కి వంటింటి తలుపు సందు లోంచి మెల్లగా జారుకుని,పెరడు లో  వాళ్ళ నానమ్మ పడక కుర్చీ లో కూర్చుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కళ్ళార్ప కుండ నక్షత్రాల కదలికలని గమనించే వాడు. పల్లెటూరు కావటం వల్లా తక్కువ వెలుతురు ఉండటం వాళ్ళ నల్లని ఆకాశం లో నక్షత్రాలు మిరుమిట్లు గోలిపేవి . చుట్టూ విరబోసిన ఆకులూ ఉన్న కొబ్బరి చెట్లు పౌర్ణమి నాటి చంద్రుడి కి ఎనలేని వన్నె తెచ్చి పెట్టేవి. రోజురోజుకు పెరిగే శుక్ల పక్షం చంద్రున్ని చూడటం అతనికి మహా సరదా.పౌర్ణమి నాటి నిండు కాంతి లో తన మొహం లో కలిగే ఆనందం అనిర్వచనీయం . అసలే చిన్న పిల్లాడు ,ఆ పై ఆ చంద్ర కాంతి లో ఆ చిరునవ్వుని చూస్తే ఎంతటి కష్టాన్నైనా మరచి పోవచ్చు. వర్షా కాలం ఎంతో మందికి ఆనందం కలిగించినా , ఆకాశాన్నిమబ్బులు కప్పి ఉండటం వాళ్ళ గౌతమ్ కి  నిరాశనే మిగిల్చేవి. చలి కాలం అతనికి చెప్పలేనంత ఇష్టం. చాల స్పష్టం గా నక్షత్రాలన్నీ కనపడుతూ ప్రకృతికి మరింత శోభ ని కూర్చేవి.

గౌతమ్ తో పాటు ఈ ఇష్టం కూడా పెరగ సాగింది. వాళ్ళ తల్లితండ్రులు ఈ వింత అబిమాన్నని చూసి చూడనట్టు వదిలేసినా , పెద్ద తరగతులకు వెళ్ళటం వల్ల చదువు అశ్రద్ద అవుతుందని వాళ్ళు గౌతమ్ పై అదుపు పెంచి , రాత్రంతా కదలకుండా పడుకునేల చూసుకునేవారు. కొన్నాళ్ళకి క్రమంగా ఆ అలవాటు నించి గౌతమ్ బైట పడ్డాడు. కానీ తన  హృదయం లోపల ఇష్టం అలాగే ఇమిడిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కళాశాలలో ఇంజనీర్ గా పట్టబద్రుడు అయ్యాడు.

ముంబై లో నూతన ప్రస్థానం....

తనకి వచ్చిన పట్టా తనకి ఏ రకం గా ఉపయోగ పడుతుందో తలియని పరిస్థితిలో , గౌతమ్ కి వచ్చిన మంచి మార్కులు చూసి ముంబై లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు తాము ఉపయోగించుకుంటాము అని రమ్మన్నారు. జీవితం లో అప్పటికి ఇంకా ఏమి చెయ్యాలో నిర్ణయించుకోక  పోవటం వల్ల వెంటనే బయలు దేరాడు. ముంబై ఆర్దిక రాజదాని అని, సముద్రం ఉంటుందని తప్ప ఇంక ఏమి తెలియకుండా మొదటి అడుగు వేసాడు. 

తన  పని వేళలు ,విదేసియుల కాలమానం ప్రకారం ఉండి రాత్రి పూట పనిచెయ్య వలిసి వచ్చేది. తోటి వారికీ ఆ సమయం కొంచెం కొత్తగా ,వింతగా అనిపించినా గౌతమ్ కి పని కి వెళ్ళటానికి చాల సరదాగా ,ఆత్రుత గా ఉండింది. తను ఎంతో ప్రేమించిన రాత్రి ఆకాశాన్ని తిరిగి చూసే అవకాసం లబించినందుకు ఆనందం పొంది, తీరిక వేళలలో అక్కడ ఉన్న చిన్న తోటల లో చెట్ల మధ్య నిర్బయం గా తిరుగుతూ ,గడ్డి మీద పడుకుని ఆకాశాన్ని, నక్షత్రాలని ఆస్వాదిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి కొబ్బరి చెట్ల స్థానం లో  ఇక్కడ ఎన్నెన్నో అంతస్తులు కలిగిన భవనాలు ఉన్న అవి ఏదొ  తెలియని కొత్త అందాన్ని తెచ్చి పెట్టేవి. కానీ అదికంగా ఉన్న కృత్రిమ కాంతి వాళ్ళ చాలా నక్షత్రాలు స్పష్టం గా కనపడేవి కాదు.అయిన కష్టపడి కాంతి లేని చోటు చూసుకుని నక్షత్రాలని గమనించే వాడు. వాటి గురించి ఎన్నో విషయాలు సేకరించినా ఎదో కొత్త సందేహం తనని వెంటాడుతూనే ఉండేది.


అలా కొనాళ్ళు గడిచిన తరువాత తన పనివేళలు ఉదయానికి మార్చారు. ఆ మార్పు గౌతమ్ జీవితం లో ఒక మలుపు కి  నాంది పలికింది. గౌతమ్ కి చిన్నప్పటి నించి పెద్దగా స్నేహితులు ఎవరు లేరు. ఉద్యోగం లో చెరాక కొంతమంది తో పరిచయం ఏర్పడినా అది పరిచయం గానే ఉండిపోయింది. ఎప్పటి లానే ఫలహారం తినేసి తన క్యాబిన్ దగ్గరకి వెళ్ళిన గౌతమ్, ఒక అమ్మాయి తన కుర్చీ లో కూర్చుని ఉండటం గమనించాడు. తనని పలకరించి ఇంకో కుర్చీ ఇచ్చి లేవమని అడిగి ,తన పని మొదలు పెట్టాడు. ఈ లోపు గౌతమ్ వాళ్ళ పై అధికారి వచ్చి కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి ని గౌతమ్ కి మిగిలిన వాళ్ళకి పరిచయం చేసాడు. ఆ అమ్మాయి పేరు తార. ఆకాశం లో ఉన్న నక్షత్రం లా మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఎంతో ఆకర్షనీయం గా ఉంటుంది. చంద్రుడికి మచ్చ ఉన్నట్టు తార కి కళ్ళజోడు ఉన్నా  అది ఆ అమ్మాయి ముఖ సౌందర్యాన్ని ఏ మాత్రం తగ్గించ లేదు. తనతో పనిచేసే వాళ్ళలో ఎంతో మంది అందమైన  అమ్మాయిలని పట్టించుకోని గౌతమ్, తార ని కూడా పట్టిచుకోకుండా పని చేసుకోసాగాడు.

Saturday, May 26, 2012

స్టీవ్ జాబ్స్ 2005 స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభ లో చేసిన ప్రసంగం


ఇది 2005 స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం లో స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగానికి  నేను చేసిన తెలుగు అనువాదం


ప్రపంచం లో నే ఉత్తమమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇక్కడి నుంచి పట్టబద్రులైన  మీ ముందు నిలబడి మాట్లాడటం నేను చాల గౌరవం గా భావిస్తున్నాను .నిజం చెప్పాలి అంటే , నేను ఎప్పుడు కళాశాల నించి పట్టబద్రుడిని  కాలేదు. కళాశాల గ్రాడ్యుయేషన్ కి ఇంత దగ్గర గా రావటం ఇదే మొదటిసారి.  ఈ రోజు నేను మీకు నా జీవితానికి సంభందించిన మూడు కథలు చెపుదాము అనుకుంటున్నాను.అంతే.పెద్ద విషయం ఏమి కాదు ..౩ కథలు మాత్రమే...

మొదటి కథ చుక్కలని(సంఘటనలు) కలపటం గురించి 

నేను రీడ్ కాలేజీ లో చేరిన ఆరు నెలలకి అక్కడ చదవటం మానేద్దాం అనుకున్నాను.కాని పూర్తిగా మానేసే ముందు ఒక పద్దెనిమిది నెలలు ఆగాను ... అసలు నేను ఎందుకు మానేద్దాం అనుకున్నాను ???

అదంతా అసలు నేను పుట్టాక ముందు మొదలయ్యింది ...నన్ను కన్నతల్లి బాగా చదువుకున్న ,పెళ్లికాని యువతి ...ఆమె నన్ను దత్తత ఇద్దాము అనుకుంది. కాని నేను కచ్చితంగా చదువుకున్న వాళ్ళ దగ్గరే పెరగాలి అనుకుంది .సమయానికి రంగం అంత సిద్దం అయ్యింది .నేను పుట్టగానే  దత్తత తీసుకోటానికి ఒక లాయరు అతని భార్య సిద్దం అయ్యారు .కాని నేను  పుట్టగానే వాళ్ళకి అమ్మాయి కావలి అని నన్ను  వదిలేసారు .

అప్పటికే నా గురించి వెయిటింగ్ లిస్టు లో ఉన్న నా తల్లితండ్రులకి అకస్మాత్తు గా నన్ను కన్నతల్లి ఫోన్ చేసి నాకు అబ్బాయి  పుట్టాడు మీకు కావలా ?? అని అడిగింది ..వాళ్ళు కచ్చితంగా  కావలి అన్నారు. కాని  నా  కన్నతల్లి వాళ్ళు ఇద్దరు సరిగా చదువుకోలేదు అని తెలిసి నన్ను ఇవ్వటానికి సంశయించింది. నా తల్లి తండ్రులు నన్ను కచ్చితంగా కాలేజీ కి పంపి చదివిస్తామని మాట ఇచ్చాక నన్ను వాళ్ళకి ఇచ్చింది. నా జీవితం అప్పుడే మొదలు అయ్యింది.

చివరికి పదిహేడేళ్ళ తరువాత నేను కాలేజీ లో చేరాను.సరిగా తెలియక పోవటం వల్ల స్టాన్ఫోర్డ్ అంతటి ఖరీదైన కాలేజీ ని ఎంచుకున్నాను . కష్టపడి పని చేసే నా తల్లితండ్రుల సంపాదన అంతా నా చదువుకే ఖర్చు అయిపోతోంది.ఆరు నెలల తరువాత అలా చదువుకోవటం లో నాకు ఏ మాత్రం విలువ కనపడలేదు...జీవితం లో ఏమి చెయ్యాలో ,అందుకు కాలేజీ చదువు నాకు ఏ రకంగా ఉపయోగ పడుతుందో నాకు ఏమి అర్ధం కాలేదు. నా తల్లితండ్రులు వాళ్ళు కష్టపడి దాచుకున్న సంపాదన అంతా నాకే ఖర్చుచేస్తున్నారు.

అందువల్ల నేను కాలేజీ మనేద్దాము అని అనుకున్నా..ఆ నిర్ణయం ద్వారా అంతా మంచే జరుగుతుంది అని నమ్మాను.ఆ సమయం లో నాకు చాలా భయమేసేది ,కాని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నిర్ణయం వల్ల నాకు ఎంతో మంచి జరగింది అనిపించంది . కాలేజీ మానేసిన మరుక్షణం నాకు నచ్చని తరగతులకి వెళ్లటం మానేసి .. నాకు నచ్చి ఆత్రుత కలిగించే వాటికే వెళ్ళే వాడిని...

అది అంత మధురంగా ఉండేది కాదు ...నాకంటూ ఒక సొంత గది ఉండేది కాదు,స్నేహితుల గదులలో నేల మీద పడుకునే వాడిని ..ఖాలీ కోకాకోల సీసాలు అమ్మి ఐదు సెంట్లు సంపాదించి భోజనం చేసేవాడిని.ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు మైళ్ళు నడచి హరే కృష్ణ గుడికి ఒక మంచి భోజనం గురించి వెళ్ళేవాడిని ,అది ఎంతో మధురంగా ఉండి నాకు బాగా నచ్చేది ...నిలకడ లేని నా ఆత్రుత , అంతర్దృష్టి తర్వాత ఎంతో విలువైనవి గా పరిణమించాయి.

మీకు ఒక ఉదాహరణ :

రీడ్ కాలేజీ అప్పట్లో అందమైన చేతివ్రాత మీద అత్యుత్తమమైన తరగతులు నిర్వహించేది. కాలేజీ లో ప్రతి పోస్టర్ , బల్ల మీద లేబుల్స్ అన్ని అందమైన చేతిరాత తో తాయారు చేయబడేవి. సాదారణమైన క్లాసులు  మానేయటం వల్ల నేనుఈ తరగతి లో చేరి , అవి ఎలా చేస్తారో తెలుసుకుందాం అనుకున్నాను. అక్కడ నేను సేరిఫ్, శాన్ సేరిఫ్ అనే ముద్రణా పద్దతుల(Typefaces) గురించి , రకరకాల అక్షరాల కలయికల మధ్య ఖాళీలు ఏ రకంగా ఇవ్వాలో ..  ముద్రణాపద్దతిని ఏమి అందంగా చేస్తుందో తెలుసుకున్నాను.అది ఎంతో కళాత్మకంగా,చారిత్రాత్మకంగా , అందంగా శాస్త్రానికి అర్ధం కానంతలా ఉండేది. అది నాకు ఎంతో మనోహరంగా అనిపించేది.

కాని ఇందులో ఏది ఆచరణాత్మకంగా కనిపించేది కాదు .కాని పదేళ్ళ తరువాత మొదటి మాకిన్న్తోష్ (Macintosh) కంప్యూటర్ తయారు చేసేటప్పుడు ఇదంతా వాడాము. అందమైన ముద్రణాపద్దతి (Typefaces) కలిగిన తొలి కంప్యూటర్ అదే .కాలేజీ లో ఆ తరగతికి నేను వెళ్ళాకపోయి ఉంటె మాక్ లో అన్ని ముద్రణాపద్దతులు కాని ,తగిన ఖాళీలు ఉన్న దస్తూరిలు కాని ఉండేవి కాదు ...అందులోను Windows ఇది కాపీ కొట్టడం వల్ల ప్రపంచం లో ఏ కంప్యూటర్ కి ఈ సౌకర్యం ఉండేది కాదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.నేను క్లాసులు మానకపోయి ఉంటె ?? ఆ తరగతులకు వెళ్ళాకపోయి ఉంటె ?? ఈ కంప్యూటర్ ల కి ఇంత  అందమైన దస్తూరి లు ఉండేవి కాదు.కాలేజీ లో ఉండేటప్పుడు చుక్కలను(సంఘటనలు)  ముందుకు కలపటం ఎంతో తికమక గా ఉండేది ,కాని పదేళ్ళ తరువాత వెనక్కి తిరగి చూసుకుంటే గడిచిన కాలం అంతా  ఎంతో అర్ధవంతం గా కనిపించింది .

మళ్ళి  చెప్తున్నా ... చుక్కలను (సంఘటనలు) ముందుకు చూస్తూ ఎప్పటికి కలపలేరు.మీరు వాటిని వెనకనించి మాత్రామే కలపగలరు.కాబట్టి ఈ చుక్కలు(సంఘటనలు) మీ భవిష్యత్తు లో ఎదోకలగా మీకు సహాయం చేస్తాయి అని మీరు నమ్మాలి.మీరు ఏదో ఒక దాన్ని కచ్చితంగా నమ్మాలి ..మీ ధైర్యాన్నో, దమ్మునో , జీవితాన్నో ,కర్మనో ఏదొక దాన్ని ,... ఈ చుక్కలు (సంఘటనలు)  మీ భవిష్యత్తు కి బాట వెయ్యగలవు అని నమ్మాలి..ఇదే మీ గుండెని అనుసరించే ధైర్యం ఇస్తుంది.ఆ బాట మంచిది కాకపోయిన మీకు నమ్మకం వల్ల ఎంతో తేడ కనపడుతుంది.

ఇక రెండో కథ : ఇది ప్రేమ , నష్టం/ఓటమి గురించి

నేను ఎంతో అదృష్టవంతుడిని ..జీవితం లో నాకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో చిన్న వయసులోనే తెలుసుకోగలిగాను.నాకు 20 ఏళ్ళ వయసు ఉన్నపుడు వాజ్ (స్టీవ్ వోజ్నియాక్),నేను మా తల్లితండ్రుల గారాజ్ లో ఆపిల్ సంస్థ ను స్థాపించాము. పదేళ్ళ కష్టం తరువాత ఇద్దరి తో మొదలయిన మా సంస్థ 4000 పైచులుకు ఉద్యోగులు , 200 కోట్ల డాలర్ల ఆదాయం కలిగిన సంస్థ గా మారింది. అత్యుత్తమమైన  మాక్  ను అప్పుడే విడుదల చేసాము ..సరిగ్గా అప్పుడే నాకు ముప్పై ఏళ్ళు వచ్చాయి.

అప్పుడే నా సంస్థ లోంచి నన్ను తీసేసారు. నేను మొదలు పెట్టిన సంస్థ నుంచి నన్ను ఎలా తెసేయ్యగలరు ??..ఆపిల్ సంస్థ పెద్దది అయ్యే కొద్ది, ప్రతిభావంతుడని నమ్మిన  ఒకడిని నాతో పాటు పని చెయ్యటానికి చేర్చుకున్నాను.ఒక యాడాది అంతా బానే గడిచింది.మెల్లగా సంస్థ గురించి  మా ఇద్దరి అబిప్రాయాలు విభేదించాయి. విడిపోదాము అని అనుకున్నపుడు డైరెక్టర్ ల బోర్డు అతని పక్షాన నిలిచింది. అంతే నా సంస్థ లోంచి నన్ను తీసేసారు.నేను చాల పెద్దగా,బహిరంగం గా విఫలం అయ్యాను. నా ఎదిగే వయసు లో దృష్టి పెట్టి కష్టపడి చేసినదంతా సర్వనాశనం అయిపొయింది.

కొన్ని నెలలు అసలు ఏమి చెయ్యాలో తోచేది కాదు. నా ముందు తరం వ్యాపారస్తుల అందరి పరువు తీసేసాను అని భావించేవాన్ని. డేవిడ్ పాకార్డ్ ,బాబ్ నోయ్స్ లను కలిసి క్షమాపణ కోరాను. నేను చాల దారుణం గా ఓడిపోయాను,ఎక్కడికైనా పారిపోవాలి అనిపించేది.కాని నాలో ఏదో భావన వ్యాపించింది. నేను ఇంకా చేసే పని ని ప్రేమిస్తున్నాను. ఆపిల్ లో జరిగిన సంఘటనలు ఆ అభిప్రాయాన్ని మార్చలేకపోయాయి .నన్ను అంతా తిరస్కరించారు.కాని నేను ప్రేమ లో ఉన్నాను.కాబట్టి మళ్ళి మొదలు పెట్టాను.

నాకు అప్పుడు తెలియలేదు కాని,ఆపిల్ లో నించి బయటికి రావటం నా జీవితం లో అత్యుత్తమమైన సంఘటన గా పరిగణించింది. ఎంతో పెద్ద విజయం పోయింది అనే బాధ, మళ్ళి మొదటి నించి మొదలు పెట్టడం అనే ఆనందం తో తీరిపోయేది. అది నా జీవితం లోనే సృజనాత్మకం గా ఆలోచించే కాలం లోకి తీసుకు వెళ్ళింది.

తర్వాతి ఐదేళ్ళలో నెక్స్ట్ (NEXT) అనే సంస్థ ను, పిక్సార్ అనే మరొక సంస్థ ను స్తాపించాను.అదే సమయం లో నాకు భార్య కాబోయే ఒక అద్బుతమయిన యువతి తో ప్రేమలో పడ్డాను.పిక్సార్ టాయ్ స్టోరీ అనే తొలి కంప్యూటర్ యనిమటేడ్ చలన చిత్రాన్ని తాయారు చేసింది.ఇప్పుడు పిక్సార్ ప్రపంచం లోనే  విజయవంతమైన సంస్థ.తరువాత జరిగిన గొప్ప,వింత సంఘటన ల లో ఆపిల్ నెక్స్ట్ ను కొనేసింది. ఆపిల్ సంస్థ లో ఇప్పుడు వాడుతున్న శైలి అంతా మేము నెక్స్ట్ లో తయారు చేసిన విజ్ఞానం ద్వారా లబించినదే. అదే సమయం లో  లారీన్,నేను మంచి కుటుంబం గా మారాము.

ఆపిల్ నించి నన్ను తీసెయ్యటం వల్లనే ఇది అంతా జరిగింది అని నేను కచ్చితం గా చెప్పగలను.అది చేదు గా అనిపించే మందు ఐనా,రోగికి అది కావాలి. జీవితం ఒక్కోసారి మనల్ని జేవితం ఇటుక రాయి తో నెత్తి మీద కొడుతుంది. మనం అప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు. నన్ను నడిపించేది నేను ప్రేమించిన పనే అని ఖచ్చితంగా నమ్మే వాడిని. మీరు ప్రేమించే పనిని కనుక్కోవాలి.

అది పనికి మరియు మీ ప్రేయసి ప్రియులకు కూడా వర్స్తిస్తుంది. మీ జీవితం లో అధిక బాగం పని తో నిండి ఉంటుంది. అది గొప్పది అని మీరు నమ్మినప్పుడే  ఆ పనిని సంతృప్తి గా చేయగలరు.చేసే పని ని ప్రేమించ గలిగినప్పుడే అది గొప్పది అవుతుంది. మీకు ఇంకా మీరు ప్రేమించే పని దొరకక పొతే వెతకండి, అది దొరికే దాక వెతుకుతూనే ఉండండి. ఆ పని మీకు దొరికినప్పుడు మీ హృదయమే మీకు తెలియజేస్తుంది.గొప్ప బంధం లాగా కాలం గడిచే కొద్ది అది మదురం గా మారుతూ ఉంటుంది.కాబట్టి ఆగకండి , వెతుకుతూనే ఉండండి.

నా మూడవ కథ మరణం గురించి.

నాకు పదిహేడు ఏళ్లు ఉన్నపుడు,నేను ఒక గొప్ప వాక్యం చదివాను. “ మీరు జీవితం లో ప్రతి రోజు అదే ఆఖరిది అని బ్రతికితే ,ఏదోక రోజు కచ్చితం గా సరైన పనే చేస్తారు “.అది నా మీద చాల ప్రభావం చూపింది.,అప్పటి నుంచి గత ౩౩ సంవత్సరాలు గా,రోజు అద్దం లో చూసుకుని “ ఈ రోజే నా ఆఖరి రోజు అయితే నేను చేద్దాము అనుకున్న పనులు అన్ని చెయ్యగలనా ?? “ అని నన్ను నేను ప్రశ్నించుకునే వాణ్ణి. వరుసగా చాలారోజులు చెయ్యలేను అని సమాధానం వస్తే నేను ఏదో మారాలి అని తెలుసుకునే వాణ్ణి.

నేను త్వరలోనే చనిపోతాను అనే అంశమే నేను జీవితం లో చేసుకున్న పెద్ద ఎంపికలకు కారణం. ఏ భావాలూ, అభిప్రాయాలూ అయితే ముఖ్యమో వాటిని ఉంచి ...అన్ని పెద్ద అంచనాలు , గౌరవం, ఓటమి లేదా సిగ్గు వల్ల కలిగే భయం లాంటి విషయాలని  చిన్నబోయెల చేస్తుంది చావు. నేను  త్వరలోనే చనిపోతాను అనే విషయం గుర్తుంచుకోవటం ,ఏదో కోల్పోతాను అనే భయం నుండి నన్ను కాపాడింది.అప్పటికే అంతా అయిపోతుంది,అయిన మీ హృదయం చెప్పిన మాట వినకపోవటం లో అర్ధం లేదు.

యాడాది క్రితం నాకు కేన్సర్ ఉంది అని కనుగొన్నారు. నాకు ఉదయం 7.30 కి స్కాన్ తీసి ...క్లోమము(pacreas) మీద ఒక గ్రంధి(Tumor) ఏర్పడింది అని చెప్పారు.నాకు క్లోమం(pacreas) అంటే ఎంతో కూడా అసలు తెలియదు.డాక్టర్లు దీనికి అసలు వైద్యమే లేదని ,ఆరు నెలల మించి బ్రతకటం కష్టమని తేల్చి ఇంట్లో పనులన్నీ చక్కపెట్టుకోమని చెప్పారు.అది “చావటానికి సిద్దమవు” అని డాక్టర్లు ఇచ్చే సంకేతం.దానికి అర్ధం మీ పిల్లలకి అన్ని విషయాలు చెప్పండి అని.దానికి మీకు ఒక 10 ఏళ్ళు సమయం ఉంటుంది అనుకుంటున్నారు ఏమో ,పొరపాటు.కొన్ని నెలలు మాత్రామే ఉంటాయి.ఇంట్లో విషయాలని సర్దుకుంటే మీ వాళ్ళకి అంతా వీలుగా ఉంటుంది,వాళ్ళకి వీడ్కోలు చెప్పేయండి అని వాళ్ళ మాటలకు అర్ధం.ఆరోజంతా నాకు డయాగొనోసిస్ చేస్తూనే ఉన్నారు.సాయంత్రం నాకు మత్తు ఇచ్చి బయూప్సి చేసారు. నా గొంతు ద్వారా,కడుపులోంచి పెగులలోకి ఒక గొట్టం పంపించి క్లోమము(pacreas) లో ఒక సుడి గుచ్చారు.నా పక్కనే కూర్చున్న మా  ఆవిడ, నా కడుపు లో నించి తీసిన పదార్దాన్ని మైక్రోస్కోప్ లో చుసిన డాక్టర్లు వెంటనే ఏడ్చారు అని చెప్పింది.వాళ్ల కన్నీరు కి కారణం, నాకు వచ్చినది ఒక అరుదైన కేన్సర్ అని కనుక్కోవటం. అది చికిత్స ద్వార తగ్గిపోతుంది అని చెప్పారుట.చికిత్స చేయిన్చుకున్నాక ఇప్పుడు బానే ఉంది.

చావుకి అదే నేను అంత దగ్గరకి వెళ్లటం.రాబోయే దశాబ్దలకి అంతకు మించి దగ్గరకు వెళ్తాను అని నేను అనుకోవట్లేదు.చావు నించి బ్రతికి బయటపడటం ద్వార అది ఒక ఉపయోగకరమైన ,తెలివైన భావన అని నేను చెప్పగలను.

ఎవ్వరికి చావాలి అని ఉండదు.స్వర్గానికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కూడా ,అక్కడికి వెళ్ళటానికి చావాలి అనుకోరు.కాని మనం అందరం పంచుకునే గమ్యస్థానం చావు ఒక్కటే.దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు.అది అలాగే ఉండాలి.చావు ఒక్కటే జీవితం లో కనిపెట్టబడిన వాటిలో అద్బుతమైన విషయం.అది జీవన గమ్యాన్ని మార్చే ఒక పద్దతి.అది పాతవాటిని శుభ్రం చేసి కొత్త తనానికిదారి ఇస్తుంది.

ప్రస్తుతానికి ఈ కొత్త మీరే ..కాని దగ్గరలో ఏదోకరోజు మీరు కూడా పాతబడి కొత్తతనానికి దారి ఇస్తారు. కఠినంగా మాట్లాడినందుకు క్షమించండి,కాని అదే నిజం.

మీ సమయం పరిమితమయినది.కాబట్టి వేరేవాళ్ళ జీవితం మీరు బ్రతికి దాన్ని వృదాచెయ్యకండి. ఇతరుల ఆలోచనల ద్వార తయారుచేయబడిన నియమాలు,పద్దతుల ద్వారా మీ జీవితాన్ని గడపడ్డు.ఇతరుల అబిప్రాయాల చప్పుడు మీ మనసు చెప్పే మాటల మీద పడనివ్వకండి

అన్నిటికంటే ముఖ్యమైనది , మీ హృదయం చెప్పే మాటలని,,మీ అంతర్దృష్టిని అనుసరించ గలిగే ధైర్యం కలిగి ఉండటం. కేవలం వాటికే మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారో తెలుసు, మిగిలినవి అన్ని మీకు అనవసరం.

నేను యవ్వనం లో ఉండేటప్పుడు, The Whole Earth Catalogue అనే ప్రచురణ ఉండేది.దాన్ని మేము ఆ కాలం లో బైబిల్ లాగా ఆరాదించే వాళ్ళం.అది ఇక్కడికి దగ్గర లోనే మెన్లో పార్క్ లో ఉండే స్టీవర్ట్ బ్రాండ్ అనే అతను తయారుచేసాడు,అతని కవితల తో ఆ పుస్తకానికి జీవం పోసాడు...అది అరవైల్లో కంపూటర్లు కనిపెట్టేక ముందు జరిగిన సంగతి. అందువల్ల ఆ పుస్తకం టైపు రైటర్లు ,కత్తెర లు ,పోలరోయిడ్ కామెరాలు వాడి తయారుచేసారు.అది గూగుల్ పుట్టుక కు 35 సంవత్సరాల క్రితం , పుస్తక రూపం లో ఉన్న  గూగుల్ లాంటిది...అది గొప్ప భావాలతో ఆదర్శాలతో నిండి ఉన్నది.

స్టీవర్ట్ మరియు అతని జట్టు ఎన్నో ముద్రణలు వేసారు.చివరికి డబ్బైల మధ్యలో ,నేను మీ వయసు లో ఉన్నపుడు దాని ఆఖరి ముద్రణ ప్రచురితమయ్యింది.దాని వెనుక అట్ట మీద మనకి చూడగానే నడవాలి అనిపించే ఒక పల్లెటూరు దారిలో అందమైన సుభోదయాన్ని చూపిస్తూ తీసిన చిత్రం ఉంది.

దాని కింద  అనే “స్టే హంగ్రీ ,స్టే ఫూలిష్ ” (STAY HUNGRY STAY FOOLISH) అనే వాక్యం ఉంది.అది వాళ్ళ వీడ్కోలు సందేశం. స్టే హంగ్రీ ,స్టే ఫూలిష్.నేను నా గురించి అదే ఎప్పడు కోరుకున్నాను.ఇప్పుడు మీరు పట్టబద్రులయ్యి కొత్త జీవితం మొదలు పెడుతున్నారు కాబట్టి నేను మీ గురించి కూడా అదే కోరుకుంటున్నాను.

స్టే హంగ్రీ ,
స్టే ఫూలిష్....
ధన్యవాదాలు..............



కొన్ని పదాలకు అర్ధాలు :
Typefaces అంటే ఒక్కసారి టైపు చేస్తే పడే అక్షరం పరిమాణం లేదా దాని శైలి.
Macintosh అంటే ఆపిల్ సంస్థ తయారు చేసిన కంప్యూటర్ పేరు 
Pacreas అంటే మనం తిన్నది అరగాటానికి కావలిసిన హార్మోన్లను విడుదల చేసే ఒక గ్రంధి.అది మన పొట్ట లో ఉంటుంది
 Tumor అంటే గడ్డ లాంటి ఒక పదార్ధం.
STAY HUNGRY STAY FOOLISH అంటే అందరు నడిచే బాట గురించి విచారించకుండా,ఎవ్వరు ఏమి అనుకుంటారో అనే సందేహం లో నుంచి నిన్ను ,నీ ఆలోచనలను వేరు గా ఉంచి ఏదోకటి సాదించాలి అనే తపన కలిగి ఉండటం.   
STAY HUNGRY అంటే సాదించిన దానితొ సంతృప్తి పడక,ఎప్పుడూ ఎదోక కొత్త పని చెయ్యాలి ,అందుకు ఏదోకటి నేర్చుకుని ,ఏదో సాదించాలి  అనే తపన, కలిగి ఉండటం.
STAY FOOLISH అంటే మనం సాదించే పని గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అనే భావన వదిలేసి,మనం నమ్మిన పనిని ఇంకా కొత్తగా ,మంచి గా ఎలా చెయ్యగలమో తెలుసుకోవటం . 

Friday, September 23, 2011

తొలి అనువాదం

భూమి యొక్క తెలివి లో బలమైన వస్తువల ఆవిర్భావం :

పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం లో , 1812 వ సంవత్సరం లో ,ప్రతి రోజు లాగానే ఇరవైలలో ఉన్న ఒక మనిషి తన సంవర్గమానం పట్టికల(Logarithm tables) పుస్తకం వంక చూస్తున్నాడు.ఆతను ఆ పట్టికల లో ఎన్నో తప్పులు ఉండ వచ్చు అని ,వాటిని కచ్చితం గా గుణించే మార్గం ఏదైనా కనుక్కోవాలి అని అనుకున్నాడు.అతను ఎప్పుడు మనిషి కన్నా యంత్రమే కచ్చితం గా గుణించ గలుగుతుంది అని నమ్మేవాడు. తన తోటి సహోద్యోగులు కూడా ఆ పట్టికలను పరిష్కరించటానికి ఏంతో  శ్రమ పడే వారు.ఆ పనిని తమ మధ్యన పంచు కునే వారు.కానీ యంత్రలలాగా పని చేసే ఈ మనుషులకి కుడికాలు తీసివేతలు కంటే క్లిష్టమైనవి కచ్చితం గా  పూరించటానికి నేర్పు లేదు.ఇంత మంది కచ్చితమైన సమాధానాలు రాబ్బాటక పోవటం తో ఆ మనిషి “నిపుణత లేని ఈ మనుషులని అత్యదిక శాతం కచ్చితం గా సమాధానం ఇచ్చే యంత్రాల తో భర్తీ చేస్తే ఎలా ఉంటుంది ?“ అని ఆలో చించాడు . ఈ ప్రపంచపు చరిత్ర ఆ క్షణం నించే మలుపు తిరిగింది.అది లెక్కలను ఖచ్చితం గా గుణించ గలిగే యంత్రాల అభివృద్ధి కి ఆలోచన కి పుట్టుక .ఆ ఆలోచన పుట్టిన ఆ మనిషి ని  ఇప్పటి సాంకేతిక యుగం లో వారు అంత  ఎరిగి ఉంటారు , కంప్యూటర్ శాస్త్ర రంగం లో వారు అయితే అతనికి సదా ఋణ పడి  ఉంటారు .అతనే చార్లెస్ బాబేజి .

కంప్యూటర్ లకి తండ్రి గా పిలవ బడే చార్లెస్ బాబేజి లెక్కలను గుణించే యంత్రాలను తన ఆలోచనలతో అభివృద్ధి పరి చాడు.ఆ యంత్రాలు మీరు ,నేను ,మనము మరియు ప్రపంచెం లో కోట్ల మంది వాడే ఆధునిక కంప్యూటర్  లను పోలి ఉండేవి. అతని రూపకల్పన ప్రపంచం లోని ఏంతో  మంది శాత్రవేత్తలను తదుపరి పరిణామాల గురించి ఆలోచింప చేసేది. ఆ ఆలోచనే ఈతరం లో ఉన్న మనల్ని ఇప్పటి కంప్యూటర్ ని వాడుకునే లాగా చేసింది .

చార్లెస్ బాబేజి కి ఆలోచన మొదలు అవటం వల్ల ఆతను డిఫ్ఫెరెంస్ ఇంజిన్   అనే పరికర్రాని రూపొందించాడు .అది అప్పటి సాంకేతికి యుగం లో ఒక పెను మార్పు గా మనం పేర్కొన వచ్చు .అవి  బహుపద గణన లు (polyniomial functions) ఒకే విలువ కలిగిన పరిమిత తేడ శ్రేణుల లెక్కలు(series of similar values by using the method of finite differences), ఏంతో  తేలిక గా చేసేది.అతని యంత్రాలు ప్రపంచపు తోలి యాంత్రిక కంప్యూటర్ లగా ఎదిగాయి .
డిఫ్ఫెరెంస్ ఇంజిన్   పాత  పడిన కొన్నాలకి ఎనలిటికల్ ఇంజిన్   అనే ఇంకొక యంత్రాన్ని తాయారు చేసాడు .అది మునుపటి దాని వలె కాకా బహు రూపకల్పనల  శ్రేణి( sequence of different designs) గా రూపొందించబడినది.ఆతను మరణము పొందు వరకు దాని  మీదే పని చేసాడు.

అడ లోవేలస్, బాబ్బెజి డిజైన్ లను అర్ధం చేసుకున్న అతి తక్కువ వారి లో ఒకరు.ఎనలిటికల్ ఇంజిన్  మీద  తొలి ప్రోగ్రాం రాసింది కూడా ఆమె. 1979 లో ఒక కంప్యూటర్ పరిభాష కు గౌరవప్రదం గా ఆమె పేరు పెట్టారు ,అడ అని  .

చార్లెస్ చనిపోయిన తరువాత తన డిజైన్లను లండన్ సైన్స్ మ్యూజియం చేపట్టింది.అక్కడ అనేక శాస్త్రవేత్తలుకొన్ని సంవత్సరాలు పనిచేసి  డిఫ్ఫెరెంస్ ఇంజిన్ ,ఎనలిటికల్ ఇంజిన్ లకు ఒక  వ్యక్తీకరించబడిన రూపం ఇచ్చారు .

కంప్యూటర్ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఆ కలం లో ఏంతో  మంది శాస్త్ర వేత్తలు విప్లవాత్మక మార్పులు తీసుకు రావటం తో మనం ఈ రోజు ఈ కంప్యూటర్ ని  ఇలా చూసి  వాడుకో గలుగుతున్నము.ఏంతో  మంది జీవితాలకు కొత్త బాష్యం చెప్పి ,అన్ని సాంకేతిక రంగాలలో అభివృద్దికి ఈ  శాస్త్ర వేత్త లే కారణం .

మనుష్యుల గురించి యంత్రాలను పని చేయించటం అనే ఆలోచన చార్లెస్ బాబేజి కి ఎలా వచ్చిందా అని నేను ఎప్పుడు ఆశ్చర్య పోతు ఉంటాను.వచ్చిన ఆలోచనను అమలు చేసినందుకు అతనికి మనం ఎన్నో ధన్యవాదాలు  చెప్పు కోవాలి .అదే కనక జరగకపోయి ఉంటె ఈరోజు ప్రపంచాన్ని మనం ఊహించలేము .

ఒక్కటి మాత్రం కచ్చితం గా చెప్పచు ,కంప్యూటర్ ఒక్కటే ప్రంచంలో ఎంతో మంది తండ్రుల(శాస్త్ర వేత్తలు) చే పుత్రుని గా పిలుచుకో బడింది.కాని అసలైన తండ్రి గా  చార్లెస్ బాబేజి కే ఆ ఘనత దక్కింది.అతనికి మన జీవితాలను మార్చినందుకు సదా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 
వ్యాసం రాసింది : వై.వి.యస్.కృష్ణ కాంత్ (ఒక ' ఎన్.ఐ.టి.' కురుక్షేత్ర విద్యార్ధి )