భూమి యొక్క తెలివి లో బలమైన వస్తువల ఆవిర్భావం :
పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం లో , 1812 వ సంవత్సరం లో ,ప్రతి రోజు లాగానే ఇరవైలలో ఉన్న ఒక మనిషి తన సంవర్గమానం పట్టికల(Logarithm tables) పుస్తకం వంక చూస్తున్నాడు.ఆతను ఆ పట్టికల లో ఎన్నో తప్పులు ఉండ వచ్చు అని ,వాటిని కచ్చితం గా గుణించే మార్గం ఏదైనా కనుక్కోవాలి అని అనుకున్నాడు.అతను ఎప్పుడు మనిషి కన్నా యంత్రమే కచ్చితం గా గుణించ గలుగుతుంది అని నమ్మేవాడు. తన తోటి సహోద్యోగులు కూడా ఆ పట్టికలను పరిష్కరించటానికి ఏంతో శ్రమ పడే వారు.ఆ పనిని తమ మధ్యన పంచు కునే వారు.కానీ యంత్రలలాగా పని చేసే ఈ మనుషులకి కుడికాలు తీసివేతలు కంటే క్లిష్టమైనవి కచ్చితం గా పూరించటానికి నేర్పు లేదు.ఇంత మంది కచ్చితమైన సమాధానాలు రాబ్బాటక పోవటం తో ఆ మనిషి “నిపుణత లేని ఈ మనుషులని అత్యదిక శాతం కచ్చితం గా సమాధానం ఇచ్చే యంత్రాల తో భర్తీ చేస్తే ఎలా ఉంటుంది ?“ అని ఆలో చించాడు . ఈ ప్రపంచపు చరిత్ర ఆ క్షణం నించే మలుపు తిరిగింది.అది లెక్కలను ఖచ్చితం గా గుణించ గలిగే యంత్రాల అభివృద్ధి కి ఆలోచన కి పుట్టుక .ఆ ఆలోచన పుట్టిన ఆ మనిషి ని ఇప్పటి సాంకేతిక యుగం లో వారు అంత ఎరిగి ఉంటారు , కంప్యూటర్ శాస్త్ర రంగం లో వారు అయితే అతనికి సదా ఋణ పడి ఉంటారు .అతనే చార్లెస్ బాబేజి .
కంప్యూటర్ లకి తండ్రి గా పిలవ బడే చార్లెస్ బాబేజి లెక్కలను గుణించే యంత్రాలను తన ఆలోచనలతో అభివృద్ధి పరి చాడు.ఆ యంత్రాలు మీరు ,నేను ,మనము మరియు ప్రపంచెం లో కోట్ల మంది వాడే ఆధునిక కంప్యూటర్ లను పోలి ఉండేవి. అతని రూపకల్పన ప్రపంచం లోని ఏంతో మంది శాత్రవేత్తలను తదుపరి పరిణామాల గురించి ఆలోచింప చేసేది. ఆ ఆలోచనే ఈతరం లో ఉన్న మనల్ని ఇప్పటి కంప్యూటర్ ని వాడుకునే లాగా చేసింది .
చార్లెస్ బాబేజి కి ఆలోచన మొదలు అవటం వల్ల ఆతను డిఫ్ఫెరెంస్ ఇంజిన్ అనే పరికర్రాని రూపొందించాడు .అది అప్పటి సాంకేతికి యుగం లో ఒక పెను మార్పు గా మనం పేర్కొన వచ్చు .అవి బహుపద గణన లు (polyniomial functions) ఒకే విలువ కలిగిన పరిమిత తేడ శ్రేణుల లెక్కలు(series of similar values by using the method of finite differences), ఏంతో తేలిక గా చేసేది.అతని యంత్రాలు ప్రపంచపు తోలి యాంత్రిక కంప్యూటర్ లగా ఎదిగాయి .
డిఫ్ఫెరెంస్ ఇంజిన్ పాత పడిన కొన్నాలకి ఎనలిటికల్ ఇంజిన్ అనే ఇంకొక యంత్రాన్ని తాయారు చేసాడు .అది మునుపటి దాని వలె కాకా బహు రూపకల్పనల శ్రేణి( sequence of different designs) గా రూపొందించబడినది.ఆతను మరణము పొందు వరకు దాని మీదే పని చేసాడు.
అడ లోవేలస్, బాబ్బెజి డిజైన్ లను అర్ధం చేసుకున్న అతి తక్కువ వారి లో ఒకరు.ఎనలిటికల్ ఇంజిన్ మీద తొలి ప్రోగ్రాం రాసింది కూడా ఆమె. 1979 లో ఒక కంప్యూటర్ పరిభాష కు గౌరవప్రదం గా ఆమె పేరు పెట్టారు ,అడ అని .
చార్లెస్ చనిపోయిన తరువాత తన డిజైన్లను లండన్ సైన్స్ మ్యూజియం చేపట్టింది.అక్కడ అనేక శాస్త్రవేత్తలుకొన్ని సంవత్సరాలు పనిచేసి డిఫ్ఫెరెంస్ ఇంజిన్ ,ఎనలిటికల్ ఇంజిన్ లకు ఒక వ్యక్తీకరించబడిన రూపం ఇచ్చారు .
కంప్యూటర్ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఆ కలం లో ఏంతో మంది శాస్త్ర వేత్తలు విప్లవాత్మక మార్పులు తీసుకు రావటం తో మనం ఈ రోజు ఈ కంప్యూటర్ ని ఇలా చూసి వాడుకో గలుగుతున్నము.ఏంతో మంది జీవితాలకు కొత్త బాష్యం చెప్పి ,అన్ని సాంకేతిక రంగాలలో అభివృద్దికి ఈ శాస్త్ర వేత్త లే కారణం .
మనుష్యుల గురించి యంత్రాలను పని చేయించటం అనే ఆలోచన చార్లెస్ బాబేజి కి ఎలా వచ్చిందా అని నేను ఎప్పుడు ఆశ్చర్య పోతు ఉంటాను.వచ్చిన ఆలోచనను అమలు చేసినందుకు అతనికి మనం ఎన్నో ధన్యవాదాలు చెప్పు కోవాలి .అదే కనక జరగకపోయి ఉంటె ఈరోజు ప్రపంచాన్ని మనం ఊహించలేము .
ఒక్కటి మాత్రం కచ్చితం గా చెప్పచు ,కంప్యూటర్ ఒక్కటే ప్రంచంలో ఎంతో మంది తండ్రుల(శాస్త్ర వేత్తలు) చే పుత్రుని గా పిలుచుకో బడింది.కాని అసలైన తండ్రి గా చార్లెస్ బాబేజి కే ఆ ఘనత దక్కింది.అతనికి మన జీవితాలను మార్చినందుకు సదా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
వ్యాసం రాసింది : వై.వి.యస్.కృష్ణ కాంత్ (ఒక ' ఎన్.ఐ.టి.' కురుక్షేత్ర విద్యార్ధి )