ఇది 2005 స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
స్నాతకోత్సవం లో స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగానికి నేను చేసిన తెలుగు అనువాదం
ప్రపంచం లో నే ఉత్తమమైన
విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇక్కడి నుంచి పట్టబద్రులైన మీ ముందు నిలబడి మాట్లాడటం నేను చాల గౌరవం గా
భావిస్తున్నాను .నిజం చెప్పాలి అంటే , నేను ఎప్పుడు కళాశాల నించి
పట్టబద్రుడిని కాలేదు. కళాశాల గ్రాడ్యుయేషన్
కి ఇంత దగ్గర గా రావటం ఇదే మొదటిసారి. ఈ రోజు నేను మీకు నా
జీవితానికి సంభందించిన మూడు కథలు చెపుదాము అనుకుంటున్నాను.అంతే.పెద్ద విషయం ఏమి
కాదు ..౩ కథలు మాత్రమే...
మొదటి కథ చుక్కలని(సంఘటనలు)
కలపటం గురించి
నేను రీడ్ కాలేజీ లో చేరిన ఆరు నెలలకి అక్కడ చదవటం మానేద్దాం
అనుకున్నాను.కాని పూర్తిగా మానేసే ముందు ఒక పద్దెనిమిది నెలలు ఆగాను ... అసలు నేను
ఎందుకు మానేద్దాం అనుకున్నాను ???
అదంతా అసలు నేను పుట్టాక ముందు
మొదలయ్యింది ...నన్ను కన్నతల్లి బాగా చదువుకున్న ,పెళ్లికాని యువతి ...ఆమె నన్ను
దత్తత ఇద్దాము అనుకుంది. కాని నేను కచ్చితంగా చదువుకున్న వాళ్ళ దగ్గరే పెరగాలి
అనుకుంది .సమయానికి రంగం అంత సిద్దం అయ్యింది .నేను పుట్టగానే దత్తత తీసుకోటానికి ఒక లాయరు అతని భార్య సిద్దం
అయ్యారు .కాని నేను పుట్టగానే వాళ్ళకి
అమ్మాయి కావలి అని నన్ను వదిలేసారు .
అప్పటికే నా గురించి వెయిటింగ్
లిస్టు లో ఉన్న నా తల్లితండ్రులకి అకస్మాత్తు గా నన్ను కన్నతల్లి ఫోన్ చేసి నాకు
అబ్బాయి పుట్టాడు మీకు కావలా ?? అని
అడిగింది ..వాళ్ళు కచ్చితంగా కావలి
అన్నారు. కాని నా కన్నతల్లి వాళ్ళు ఇద్దరు సరిగా చదువుకోలేదు అని
తెలిసి నన్ను ఇవ్వటానికి సంశయించింది. నా తల్లి తండ్రులు నన్ను కచ్చితంగా కాలేజీ
కి పంపి చదివిస్తామని మాట ఇచ్చాక నన్ను వాళ్ళకి ఇచ్చింది. నా జీవితం అప్పుడే మొదలు
అయ్యింది.
చివరికి పదిహేడేళ్ళ తరువాత
నేను కాలేజీ లో చేరాను.సరిగా తెలియక పోవటం వల్ల స్టాన్ఫోర్డ్ అంతటి ఖరీదైన
కాలేజీ ని ఎంచుకున్నాను . కష్టపడి పని చేసే నా తల్లితండ్రుల సంపాదన అంతా నా
చదువుకే ఖర్చు అయిపోతోంది.ఆరు నెలల తరువాత అలా చదువుకోవటం లో నాకు ఏ మాత్రం విలువ
కనపడలేదు...జీవితం లో ఏమి చెయ్యాలో ,అందుకు కాలేజీ చదువు నాకు ఏ రకంగా ఉపయోగ
పడుతుందో నాకు ఏమి అర్ధం కాలేదు. నా తల్లితండ్రులు వాళ్ళు కష్టపడి దాచుకున్న సంపాదన
అంతా నాకే ఖర్చుచేస్తున్నారు.
అందువల్ల నేను కాలేజీ
మనేద్దాము అని అనుకున్నా..ఆ నిర్ణయం ద్వారా అంతా మంచే జరుగుతుంది అని నమ్మాను.ఆ
సమయం లో నాకు చాలా భయమేసేది ,కాని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నిర్ణయం వల్ల నాకు
ఎంతో మంచి జరగింది అనిపించంది . కాలేజీ మానేసిన మరుక్షణం నాకు నచ్చని తరగతులకి వెళ్లటం మానేసి
.. నాకు నచ్చి ఆత్రుత కలిగించే వాటికే వెళ్ళే వాడిని...
అది అంత మధురంగా ఉండేది
కాదు ...నాకంటూ ఒక సొంత గది ఉండేది కాదు,స్నేహితుల గదులలో నేల మీద పడుకునే వాడిని
..ఖాలీ కోకాకోల సీసాలు అమ్మి ఐదు సెంట్లు సంపాదించి భోజనం చేసేవాడిని.ప్రతి ఆదివారం
సాయంత్రం ఏడు మైళ్ళు నడచి హరే కృష్ణ గుడికి ఒక మంచి భోజనం గురించి వెళ్ళేవాడిని
,అది ఎంతో మధురంగా ఉండి నాకు బాగా నచ్చేది ...నిలకడ లేని నా ఆత్రుత , అంతర్దృష్టి
తర్వాత ఎంతో విలువైనవి గా పరిణమించాయి.
మీకు ఒక ఉదాహరణ :
రీడ్ కాలేజీ అప్పట్లో అందమైన చేతివ్రాత మీద అత్యుత్తమమైన తరగతులు నిర్వహించేది.
కాలేజీ లో ప్రతి పోస్టర్ , బల్ల మీద లేబుల్స్ అన్ని అందమైన చేతిరాత తో తాయారు
చేయబడేవి. సాదారణమైన క్లాసులు
మానేయటం వల్ల నేనుఈ తరగతి లో చేరి , అవి ఎలా చేస్తారో తెలుసుకుందాం
అనుకున్నాను. అక్కడ నేను సేరిఫ్, శాన్ సేరిఫ్ అనే ముద్రణా పద్దతుల(Typefaces) గురించి , రకరకాల అక్షరాల
కలయికల మధ్య ఖాళీలు ఏ రకంగా ఇవ్వాలో ..
ముద్రణాపద్దతిని ఏమి అందంగా చేస్తుందో తెలుసుకున్నాను.అది ఎంతో
కళాత్మకంగా,చారిత్రాత్మకంగా , అందంగా శాస్త్రానికి అర్ధం కానంతలా ఉండేది. అది నాకు
ఎంతో మనోహరంగా అనిపించేది.
కాని ఇందులో ఏది
ఆచరణాత్మకంగా కనిపించేది కాదు .కాని పదేళ్ళ తరువాత మొదటి మాకిన్న్తోష్ (Macintosh) కంప్యూటర్ తయారు
చేసేటప్పుడు ఇదంతా వాడాము. అందమైన ముద్రణాపద్దతి (Typefaces) కలిగిన తొలి కంప్యూటర్ అదే .కాలేజీ లో ఆ
తరగతికి నేను వెళ్ళాకపోయి ఉంటె మాక్ లో అన్ని ముద్రణాపద్దతులు కాని ,తగిన ఖాళీలు
ఉన్న దస్తూరిలు కాని ఉండేవి కాదు ...అందులోను Windows ఇది కాపీ కొట్టడం వల్ల
ప్రపంచం లో ఏ కంప్యూటర్ కి ఈ సౌకర్యం ఉండేది కాదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.నేను
క్లాసులు మానకపోయి ఉంటె ?? ఆ తరగతులకు వెళ్ళాకపోయి ఉంటె ?? ఈ కంప్యూటర్ ల కి
ఇంత అందమైన దస్తూరి లు ఉండేవి కాదు.కాలేజీ
లో ఉండేటప్పుడు చుక్కలను(సంఘటనలు) ముందుకు
కలపటం ఎంతో తికమక గా ఉండేది ,కాని పదేళ్ళ తరువాత వెనక్కి తిరగి చూసుకుంటే గడిచిన
కాలం అంతా ఎంతో అర్ధవంతం గా కనిపించింది .
మళ్ళి చెప్తున్నా ... చుక్కలను (సంఘటనలు) ముందుకు
చూస్తూ ఎప్పటికి కలపలేరు.మీరు వాటిని వెనకనించి మాత్రామే కలపగలరు.కాబట్టి ఈ
చుక్కలు(సంఘటనలు) మీ భవిష్యత్తు లో ఎదోకలగా మీకు సహాయం చేస్తాయి అని మీరు
నమ్మాలి.మీరు ఏదో ఒక దాన్ని కచ్చితంగా నమ్మాలి ..మీ ధైర్యాన్నో, దమ్మునో ,
జీవితాన్నో ,కర్మనో ఏదొక దాన్ని ,... ఈ చుక్కలు (సంఘటనలు) మీ భవిష్యత్తు కి బాట వెయ్యగలవు అని
నమ్మాలి..ఇదే మీ గుండెని అనుసరించే ధైర్యం ఇస్తుంది.ఆ బాట మంచిది కాకపోయిన మీకు
నమ్మకం వల్ల ఎంతో తేడ కనపడుతుంది.
ఇక రెండో కథ : ఇది ప్రేమ ,
నష్టం/ఓటమి గురించి
నేను ఎంతో అదృష్టవంతుడిని
..జీవితం లో నాకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో చిన్న వయసులోనే
తెలుసుకోగలిగాను.నాకు 20 ఏళ్ళ వయసు ఉన్నపుడు వాజ్
(స్టీవ్ వోజ్నియాక్),నేను మా తల్లితండ్రుల గారాజ్ లో ఆపిల్ సంస్థ ను స్థాపించాము. పదేళ్ళ
కష్టం తరువాత ఇద్దరి తో మొదలయిన మా సంస్థ 4000 పైచులుకు ఉద్యోగులు , 200 కోట్ల డాలర్ల ఆదాయం కలిగిన సంస్థ గా మారింది. అత్యుత్తమమైన మాక్
ను అప్పుడే విడుదల చేసాము ..సరిగ్గా అప్పుడే నాకు ముప్పై ఏళ్ళు వచ్చాయి.
అప్పుడే నా సంస్థ లోంచి
నన్ను తీసేసారు. నేను మొదలు పెట్టిన సంస్థ నుంచి నన్ను ఎలా తెసేయ్యగలరు ??..ఆపిల్ సంస్థ
పెద్దది అయ్యే కొద్ది, ప్రతిభావంతుడని నమ్మిన
ఒకడిని నాతో పాటు పని చెయ్యటానికి చేర్చుకున్నాను.ఒక యాడాది అంతా బానే
గడిచింది.మెల్లగా సంస్థ గురించి మా ఇద్దరి
అబిప్రాయాలు విభేదించాయి. విడిపోదాము అని అనుకున్నపుడు డైరెక్టర్ ల బోర్డు అతని
పక్షాన నిలిచింది. అంతే నా సంస్థ లోంచి నన్ను తీసేసారు.నేను చాల పెద్దగా,బహిరంగం
గా విఫలం అయ్యాను. నా ఎదిగే వయసు లో దృష్టి పెట్టి కష్టపడి చేసినదంతా సర్వనాశనం
అయిపొయింది.
కొన్ని నెలలు అసలు ఏమి
చెయ్యాలో తోచేది కాదు. నా ముందు తరం వ్యాపారస్తుల అందరి పరువు తీసేసాను అని
భావించేవాన్ని. డేవిడ్ పాకార్డ్ ,బాబ్ నోయ్స్ లను కలిసి క్షమాపణ కోరాను. నేను చాల దారుణం
గా ఓడిపోయాను,ఎక్కడికైనా పారిపోవాలి అనిపించేది.కాని నాలో ఏదో భావన వ్యాపించింది. నేను
ఇంకా చేసే పని ని ప్రేమిస్తున్నాను. ఆపిల్ లో జరిగిన సంఘటనలు ఆ అభిప్రాయాన్ని
మార్చలేకపోయాయి .నన్ను అంతా తిరస్కరించారు.కాని నేను ప్రేమ లో ఉన్నాను.కాబట్టి మళ్ళి మొదలు పెట్టాను.
నాకు అప్పుడు తెలియలేదు
కాని,ఆపిల్ లో నించి బయటికి రావటం నా జీవితం లో అత్యుత్తమమైన సంఘటన గా
పరిగణించింది. ఎంతో పెద్ద విజయం పోయింది అనే బాధ, మళ్ళి మొదటి నించి మొదలు పెట్టడం
అనే ఆనందం తో తీరిపోయేది. అది నా జీవితం లోనే సృజనాత్మకం గా ఆలోచించే కాలం లోకి
తీసుకు వెళ్ళింది.
తర్వాతి ఐదేళ్ళలో నెక్స్ట్ (NEXT) అనే సంస్థ ను, పిక్సార్ అనే మరొక సంస్థ ను స్తాపించాను.అదే
సమయం లో నాకు భార్య కాబోయే ఒక అద్బుతమయిన యువతి తో ప్రేమలో పడ్డాను.పిక్సార్ టాయ్
స్టోరీ అనే తొలి కంప్యూటర్ యనిమటేడ్ చలన చిత్రాన్ని తాయారు చేసింది.ఇప్పుడు
పిక్సార్ ప్రపంచం లోనే విజయవంతమైన సంస్థ.తరువాత
జరిగిన గొప్ప,వింత సంఘటన ల లో ఆపిల్ నెక్స్ట్ ను కొనేసింది. ఆపిల్ సంస్థ లో
ఇప్పుడు వాడుతున్న శైలి అంతా మేము నెక్స్ట్ లో తయారు చేసిన విజ్ఞానం ద్వారా
లబించినదే. అదే సమయం లో లారీన్,నేను మంచి
కుటుంబం గా మారాము.
ఆపిల్ నించి నన్ను
తీసెయ్యటం వల్లనే ఇది అంతా జరిగింది అని నేను కచ్చితం గా చెప్పగలను.అది చేదు గా
అనిపించే మందు ఐనా,రోగికి అది కావాలి. జీవితం ఒక్కోసారి మనల్ని జేవితం ఇటుక రాయి తో
నెత్తి మీద కొడుతుంది. మనం అప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు. నన్ను నడిపించేది నేను
ప్రేమించిన పనే అని ఖచ్చితంగా నమ్మే వాడిని. మీరు ప్రేమించే పనిని కనుక్కోవాలి.
అది పనికి మరియు మీ ప్రేయసి
ప్రియులకు కూడా వర్స్తిస్తుంది. మీ జీవితం లో అధిక బాగం పని తో నిండి ఉంటుంది. అది
గొప్పది అని మీరు నమ్మినప్పుడే ఆ పనిని
సంతృప్తి గా చేయగలరు.చేసే పని ని ప్రేమించ గలిగినప్పుడే అది గొప్పది అవుతుంది. మీకు
ఇంకా మీరు ప్రేమించే పని దొరకక పొతే వెతకండి, అది దొరికే దాక వెతుకుతూనే ఉండండి. ఆ
పని మీకు దొరికినప్పుడు మీ హృదయమే మీకు తెలియజేస్తుంది.గొప్ప బంధం లాగా కాలం గడిచే
కొద్ది అది మదురం గా మారుతూ ఉంటుంది.కాబట్టి ఆగకండి , వెతుకుతూనే ఉండండి.
నా మూడవ కథ మరణం గురించి.
నాకు పదిహేడు ఏళ్లు
ఉన్నపుడు,నేను ఒక గొప్ప వాక్యం చదివాను. “ మీరు జీవితం లో ప్రతి రోజు అదే ఆఖరిది
అని బ్రతికితే ,ఏదోక రోజు కచ్చితం గా సరైన పనే చేస్తారు “.అది నా మీద చాల ప్రభావం
చూపింది.,అప్పటి నుంచి గత ౩౩ సంవత్సరాలు గా,రోజు అద్దం లో చూసుకుని “ ఈ రోజే నా
ఆఖరి రోజు అయితే నేను చేద్దాము అనుకున్న పనులు అన్ని చెయ్యగలనా ?? “ అని నన్ను నేను
ప్రశ్నించుకునే వాణ్ణి. వరుసగా చాలారోజులు చెయ్యలేను అని సమాధానం వస్తే నేను ఏదో
మారాలి అని తెలుసుకునే వాణ్ణి.
నేను త్వరలోనే చనిపోతాను
అనే అంశమే నేను జీవితం లో చేసుకున్న పెద్ద ఎంపికలకు కారణం. ఏ భావాలూ, అభిప్రాయాలూ
అయితే ముఖ్యమో వాటిని ఉంచి ...అన్ని పెద్ద అంచనాలు , గౌరవం, ఓటమి లేదా సిగ్గు వల్ల
కలిగే భయం లాంటి విషయాలని చిన్నబోయెల
చేస్తుంది చావు. నేను త్వరలోనే చనిపోతాను
అనే విషయం గుర్తుంచుకోవటం ,ఏదో కోల్పోతాను అనే భయం నుండి నన్ను కాపాడింది.అప్పటికే
అంతా అయిపోతుంది,అయిన మీ హృదయం చెప్పిన మాట వినకపోవటం లో అర్ధం లేదు.
యాడాది క్రితం నాకు కేన్సర్
ఉంది అని కనుగొన్నారు. నాకు ఉదయం 7.30 కి స్కాన్ తీసి ...క్లోమము(pacreas) మీద ఒక గ్రంధి(Tumor) ఏర్పడింది అని
చెప్పారు.నాకు క్లోమం(pacreas) అంటే ఎంతో కూడా అసలు తెలియదు.డాక్టర్లు దీనికి అసలు
వైద్యమే లేదని ,ఆరు నెలల మించి బ్రతకటం కష్టమని తేల్చి ఇంట్లో పనులన్నీ
చక్కపెట్టుకోమని చెప్పారు.అది “చావటానికి సిద్దమవు” అని డాక్టర్లు ఇచ్చే
సంకేతం.దానికి అర్ధం మీ పిల్లలకి అన్ని విషయాలు చెప్పండి అని.దానికి మీకు ఒక 10 ఏళ్ళు సమయం ఉంటుంది
అనుకుంటున్నారు ఏమో ,పొరపాటు.కొన్ని నెలలు మాత్రామే ఉంటాయి.ఇంట్లో విషయాలని సర్దుకుంటే
మీ వాళ్ళకి అంతా వీలుగా ఉంటుంది,వాళ్ళకి వీడ్కోలు చెప్పేయండి అని వాళ్ళ మాటలకు
అర్ధం.ఆరోజంతా నాకు డయాగొనోసిస్ చేస్తూనే ఉన్నారు.సాయంత్రం నాకు మత్తు ఇచ్చి బయూప్సి
చేసారు. నా గొంతు ద్వారా,కడుపులోంచి పెగులలోకి ఒక గొట్టం పంపించి క్లోమము(pacreas) లో ఒక సుడి
గుచ్చారు.నా పక్కనే కూర్చున్న మా ఆవిడ, నా
కడుపు లో నించి తీసిన పదార్దాన్ని మైక్రోస్కోప్ లో చుసిన డాక్టర్లు వెంటనే ఏడ్చారు
అని చెప్పింది.వాళ్ల కన్నీరు కి కారణం, నాకు వచ్చినది ఒక అరుదైన కేన్సర్ అని
కనుక్కోవటం. అది చికిత్స ద్వార తగ్గిపోతుంది అని చెప్పారుట.చికిత్స చేయిన్చుకున్నాక
ఇప్పుడు బానే ఉంది.
చావుకి అదే నేను అంత
దగ్గరకి వెళ్లటం.రాబోయే దశాబ్దలకి అంతకు మించి దగ్గరకు వెళ్తాను అని నేను
అనుకోవట్లేదు.చావు నించి బ్రతికి బయటపడటం ద్వార అది ఒక ఉపయోగకరమైన ,తెలివైన భావన
అని నేను చెప్పగలను.
ఎవ్వరికి చావాలి అని ఉండదు.స్వర్గానికి వెళ్ళాలి అని అనుకునే
వాళ్ళు కూడా ,అక్కడికి వెళ్ళటానికి చావాలి అనుకోరు.కాని మనం అందరం పంచుకునే
గమ్యస్థానం చావు ఒక్కటే.దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు.అది అలాగే ఉండాలి.చావు
ఒక్కటే జీవితం లో కనిపెట్టబడిన వాటిలో అద్బుతమైన విషయం.అది జీవన గమ్యాన్ని మార్చే
ఒక పద్దతి.అది పాతవాటిని శుభ్రం చేసి కొత్త తనానికిదారి ఇస్తుంది.
ప్రస్తుతానికి ఈ కొత్త మీరే
..కాని దగ్గరలో ఏదోకరోజు మీరు కూడా పాతబడి కొత్తతనానికి దారి ఇస్తారు. కఠినంగా మాట్లాడినందుకు
క్షమించండి,కాని అదే నిజం.
మీ
సమయం పరిమితమయినది.కాబట్టి వేరేవాళ్ళ జీవితం మీరు బ్రతికి దాన్ని వృదాచెయ్యకండి.
ఇతరుల ఆలోచనల ద్వార తయారుచేయబడిన నియమాలు,పద్దతుల ద్వారా మీ జీవితాన్ని
గడపడ్డు.ఇతరుల అబిప్రాయాల చప్పుడు మీ మనసు చెప్పే మాటల మీద పడనివ్వకండి
అన్నిటికంటే
ముఖ్యమైనది , మీ హృదయం చెప్పే మాటలని,,మీ అంతర్దృష్టిని అనుసరించ గలిగే ధైర్యం కలిగి
ఉండటం. కేవలం వాటికే మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారో తెలుసు, మిగిలినవి అన్ని మీకు
అనవసరం.
నేను యవ్వనం లో ఉండేటప్పుడు, The Whole Earth
Catalogue అనే
ప్రచురణ ఉండేది.దాన్ని మేము ఆ కాలం లో బైబిల్ లాగా ఆరాదించే వాళ్ళం.అది ఇక్కడికి
దగ్గర లోనే మెన్లో పార్క్ లో ఉండే స్టీవర్ట్ బ్రాండ్ అనే అతను తయారుచేసాడు,అతని
కవితల తో ఆ పుస్తకానికి జీవం పోసాడు...అది అరవైల్లో కంపూటర్లు కనిపెట్టేక ముందు
జరిగిన సంగతి. అందువల్ల
ఆ పుస్తకం టైపు రైటర్లు ,కత్తెర లు ,పోలరోయిడ్
కామెరాలు వాడి తయారుచేసారు.అది గూగుల్ పుట్టుక కు 35 సంవత్సరాల క్రితం , పుస్తక రూపం లో ఉన్న గూగుల్ లాంటిది...అది గొప్ప భావాలతో ఆదర్శాలతో
నిండి ఉన్నది.
స్టీవర్ట్
మరియు అతని జట్టు ఎన్నో ముద్రణలు వేసారు.చివరికి డబ్బైల మధ్యలో ,నేను మీ వయసు లో
ఉన్నపుడు దాని ఆఖరి ముద్రణ ప్రచురితమయ్యింది.దాని వెనుక అట్ట మీద మనకి చూడగానే
నడవాలి అనిపించే ఒక పల్లెటూరు దారిలో అందమైన సుభోదయాన్ని చూపిస్తూ తీసిన చిత్రం
ఉంది.
దాని
కింద అనే “స్టే హంగ్రీ ,స్టే ఫూలిష్ ” (STAY HUNGRY
STAY FOOLISH)
అనే వాక్యం ఉంది.అది వాళ్ళ వీడ్కోలు సందేశం. స్టే హంగ్రీ ,స్టే ఫూలిష్.నేను నా
గురించి అదే ఎప్పడు కోరుకున్నాను.ఇప్పుడు మీరు పట్టబద్రులయ్యి కొత్త జీవితం మొదలు
పెడుతున్నారు కాబట్టి నేను మీ గురించి కూడా అదే కోరుకుంటున్నాను.
స్టే
హంగ్రీ ,
స్టే
ఫూలిష్....
ధన్యవాదాలు..............
కొన్ని
పదాలకు అర్ధాలు :
Typefaces అంటే ఒక్కసారి టైపు చేస్తే పడే
అక్షరం పరిమాణం లేదా దాని శైలి.
Macintosh అంటే ఆపిల్ సంస్థ తయారు చేసిన కంప్యూటర్ పేరు
Pacreas అంటే మనం తిన్నది అరగాటానికి కావలిసిన హార్మోన్లను విడుదల
చేసే ఒక గ్రంధి.అది మన పొట్ట లో ఉంటుంది
Tumor అంటే గడ్డ లాంటి ఒక పదార్ధం.
STAY HUNGRY STAY FOOLISH
అంటే అందరు నడిచే బాట గురించి విచారించకుండా,ఎవ్వరు ఏమి అనుకుంటారో అనే సందేహం లో
నుంచి నిన్ను ,నీ ఆలోచనలను వేరు గా ఉంచి ఏదోకటి సాదించాలి అనే తపన కలిగి
ఉండటం.
STAY HUNGRY
అంటే సాదించిన దానితొ సంతృప్తి పడక,ఎప్పుడూ ఎదోక కొత్త పని చెయ్యాలి ,అందుకు
ఏదోకటి నేర్చుకుని ,ఏదో సాదించాలి అనే
తపన, కలిగి ఉండటం.
STAY FOOLISH
అంటే మనం సాదించే పని గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అనే భావన వదిలేసి,మనం నమ్మిన
పనిని ఇంకా కొత్తగా ,మంచి గా ఎలా చెయ్యగలమో తెలుసుకోవటం .
