Sunday, May 11, 2014

Tarodayam - 1

తారోదయం
(1)

జీవితం ఎప్పుడు ఎవరికీ ఏ పాఠం నేర్పుతుందో తెలియదు. ఆ పాఠం నేర్పేటప్పుడు ఏమి అనిపించక పోయిన ,అయ్యాక ఫలితం ఇచ్చేముందు చాలా చేదు గా అనిపిస్తుంది. తారువాత వచ్చే తీపిని సరిగ్గా అనుభవించేలా చేసేందుకు జీవితం ఎంచుకున్న దారి ఇది. కాని ఆ చేదు ని భరించలేక చాలా మంది మధ్యలో ఏదైనా తీపి పదార్ధం తినేస్తారు. అలాంటి వాళ్ళకి జీవితం ఇంకొంచెం కఠీనంగా,ఒక డిప్పకాయ కొట్టి మరీ పాఠం మళ్ళి చెప్తుంది. చేదు తట్టుకోలేక ఆ చిన్ని తీపి పదార్ధాన్ని ని రుచి చుస్తే చివరికి కధ కంచికి వెళ్ళినా మధ్యలో అష్ట కష్టాలు పడవలిసి వస్తుంది. చిన్నపటి నించి చేదు రుచి ఎరగని గౌతమ్ కూడా అలా మొదటిసారి పాఠం చెప్పించుకున్నాక తట్టుకోలేక చేతికందిన పంచదారని నోట్లో వేసుకుని ఆ క్షణం తారాస్థాయి లో ఆనందప్పడ్డా, తరువాత చేదు దిగేదాకా చింతించాల్సి వచ్చింది. చివరికి చేదు దిగుతుందో లేదో తెలియని ఒక సందిగ్దం లో పడి ఇంకా తికమక పడుతున్నాడు.

ప్రకృతిని ,జీవితాన్ని కలిపి ఆస్వాదించటం చాలా తక్కువ మందికి ఉండే గొప్ప కళ. అలా ఆస్వాదించగలిగే వాళ్ళు ప్రతి రోజు ని ,రాత్రి ని అందరు చూడలేని ఒక వింత కోణం లో చుడగలరు. ఆ ఆనందం వాళ్ళకే సొంతం. వాళ్ళు మామూలు మనుష్యులతో కలిసి మెలగటం కష్టం. సూర్యాస్తమయం అందరికి ఆ రోజుకి అంతం లా కనపడితే , కొంతమందికి తరువాత కొన్ని గంటలలో ప్రారంబమయ్యే అద్బుతమైన అందాలకి శ్రీకారం. రాత్రిపూట ఆకాశాన్ని చూడకుండా ఉండలేని వాళ్ళలో గౌతమ్ మొదటివాడు. మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల్లన్నా,మబ్బుల చాటున దగుడుమూతలడుతున్న చందమామన్నా కళ్ళు రెప్ప వెయ్యకుండా చూస్తాడు. కొన్నిసార్లు మన వింత అలవాట్లు వింత అనుబుతిని మిగిల్చి, మరి కొన్ని సార్లు అంట కంటే వింత మనుష్యులనిపరిచయం చేస్తాయి.ఎన్నో కొత్త అందాల్ని మన చెంత చేరుస్తాయి,జీవితాన్ని మరింత అందం గా చేకూరుస్తాయి. ముంబై లో గౌతమ్ గడిపిన కాలం అలాంటిది . జీవితం గౌతమ్ కి పాఠం చెప్పాలి అనుకున్న కాలం కూడా అదే.

ఈ లోపు ప్రస్తుతానికి గౌతమ్ రెప్ప వాల్చకుండా చెన్నై బెసంట్ నగర్ బీచ్ దగ్గర కాలం గడుపుతున్న రోజులలో .....

అప్పుడే పక్షులు నిద్రలోంచి లేచి కూని రాగాలు తీస్తున్నాయి. ప్రపంచం ఇంకా ఒళ్ళు మరచి నిద్రపోయే సమయం అది.ఏ మాత్రం గోల లేకుండా చక్కటి హాయి ని ప్రశాంతత ని కలిగించే సమయం.ఏ వాహనం శబ్దం ఉండదు, అమ్మకాల వాళ్ళ గోల ఉండదు, అన్నిటిని మించి చిందరవందర మనసులు ఉండే మనుష్యుల గోల అస్సలు ఉండదు.తను ఎప్పుడు కూర్చునే సముద్రపు ఒడ్డు మీద కూర్చుని నుంచి అప్పుడే అస్తమిస్తున్న చంద్రున్ని చూస్తున్నాడు. ఇంకో పౌర్ణమి దగ్గరకి వస్తోంది. పౌర్ణమి అంటే గుండెల్లో ఎనలేని బాధ  పడతాడు గౌతమ్. కొన్ని నెలలు గా తను కొత్తగా వచ్చిన ఉళ్ళో ఎన్నో కొత్త సంగతులు తెలుసుకుని, వింత అనుభవాలు పొంది  చాల కొత్త మనిషిలా తయారు అయినా పాత జ్ఞ్యపకాలు కొన్ని వెంటాడుతూనే ఉన్నాయి,అందులో పౌర్ణమి ఒకటి. పడమరన అంతకంతకు కిందకి దిగుతున్న చంద్రున్ని చూస్తూ తన గుండెల్లో తార మిగిల్చిన తీపి గుర్తులను అంతకంతకు దిగమింగుతున్నాడు.

తూర్పున ఈ లోపు నేనున్నాను అని వస్తున్నా సూర్యున్ని చూసి ఎదో కొత్త ఆశ కలిగినా చంద్రున్ని చూసి తనకి తలియకుండా వచ్చిన కన్నీటి బొట్టుని తుడుచుకుని నవ్వుకుంటూ , ఆ రోజుకి విశ్రమించటానికి అడుగు ముందుకు కదిపాడు. అమ్మవారి గుడి లో హారతి అయ్యాక గంటలు మోగాయి , వీధులు జనాలతో నిండాయి, పిల్లలు పాఠశాలలకి వెళ్తున్నారు, వాహనాలు గోల చేస్తూ తిరుగుతున్నాయి, యధావిధి గా గౌతమ్ కళ్ళు మూత పడ్డాయి.

అంతకు కొన్నేళ్ళ ముందు చించినాడ అనే పల్లెటూరు లో .....

ఆకాశం అన్నా,నక్షత్రాలన్న అన్నిటిని మించి చంద్రుడు అన్నా గౌతమ్ కి అమితమైన ఇష్టం. చిన్ననాటి నుంచి రాత్రిళ్ళు  ఎక్కువ సమయం వాళ్ళ ఇంటి బైట పెరడు లో గడపడం వాళ్ళ రాత్రిపూట ఆకాశానికి తనకి విడదీయలేని సంబంధం ఏర్పడింది. అమ్మ పక్కనే పడుకున్నా, పిల్లి లా నక్కి నక్కి వంటింటి తలుపు సందు లోంచి మెల్లగా జారుకుని,పెరడు లో  వాళ్ళ నానమ్మ పడక కుర్చీ లో కూర్చుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కళ్ళార్ప కుండ నక్షత్రాల కదలికలని గమనించే వాడు. పల్లెటూరు కావటం వల్లా తక్కువ వెలుతురు ఉండటం వాళ్ళ నల్లని ఆకాశం లో నక్షత్రాలు మిరుమిట్లు గోలిపేవి . చుట్టూ విరబోసిన ఆకులూ ఉన్న కొబ్బరి చెట్లు పౌర్ణమి నాటి చంద్రుడి కి ఎనలేని వన్నె తెచ్చి పెట్టేవి. రోజురోజుకు పెరిగే శుక్ల పక్షం చంద్రున్ని చూడటం అతనికి మహా సరదా.పౌర్ణమి నాటి నిండు కాంతి లో తన మొహం లో కలిగే ఆనందం అనిర్వచనీయం . అసలే చిన్న పిల్లాడు ,ఆ పై ఆ చంద్ర కాంతి లో ఆ చిరునవ్వుని చూస్తే ఎంతటి కష్టాన్నైనా మరచి పోవచ్చు. వర్షా కాలం ఎంతో మందికి ఆనందం కలిగించినా , ఆకాశాన్నిమబ్బులు కప్పి ఉండటం వాళ్ళ గౌతమ్ కి  నిరాశనే మిగిల్చేవి. చలి కాలం అతనికి చెప్పలేనంత ఇష్టం. చాల స్పష్టం గా నక్షత్రాలన్నీ కనపడుతూ ప్రకృతికి మరింత శోభ ని కూర్చేవి.

గౌతమ్ తో పాటు ఈ ఇష్టం కూడా పెరగ సాగింది. వాళ్ళ తల్లితండ్రులు ఈ వింత అబిమాన్నని చూసి చూడనట్టు వదిలేసినా , పెద్ద తరగతులకు వెళ్ళటం వల్ల చదువు అశ్రద్ద అవుతుందని వాళ్ళు గౌతమ్ పై అదుపు పెంచి , రాత్రంతా కదలకుండా పడుకునేల చూసుకునేవారు. కొన్నాళ్ళకి క్రమంగా ఆ అలవాటు నించి గౌతమ్ బైట పడ్డాడు. కానీ తన  హృదయం లోపల ఇష్టం అలాగే ఇమిడిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కళాశాలలో ఇంజనీర్ గా పట్టబద్రుడు అయ్యాడు.

ముంబై లో నూతన ప్రస్థానం....

తనకి వచ్చిన పట్టా తనకి ఏ రకం గా ఉపయోగ పడుతుందో తలియని పరిస్థితిలో , గౌతమ్ కి వచ్చిన మంచి మార్కులు చూసి ముంబై లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు తాము ఉపయోగించుకుంటాము అని రమ్మన్నారు. జీవితం లో అప్పటికి ఇంకా ఏమి చెయ్యాలో నిర్ణయించుకోక  పోవటం వల్ల వెంటనే బయలు దేరాడు. ముంబై ఆర్దిక రాజదాని అని, సముద్రం ఉంటుందని తప్ప ఇంక ఏమి తెలియకుండా మొదటి అడుగు వేసాడు. 

తన  పని వేళలు ,విదేసియుల కాలమానం ప్రకారం ఉండి రాత్రి పూట పనిచెయ్య వలిసి వచ్చేది. తోటి వారికీ ఆ సమయం కొంచెం కొత్తగా ,వింతగా అనిపించినా గౌతమ్ కి పని కి వెళ్ళటానికి చాల సరదాగా ,ఆత్రుత గా ఉండింది. తను ఎంతో ప్రేమించిన రాత్రి ఆకాశాన్ని తిరిగి చూసే అవకాసం లబించినందుకు ఆనందం పొంది, తీరిక వేళలలో అక్కడ ఉన్న చిన్న తోటల లో చెట్ల మధ్య నిర్బయం గా తిరుగుతూ ,గడ్డి మీద పడుకుని ఆకాశాన్ని, నక్షత్రాలని ఆస్వాదిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి కొబ్బరి చెట్ల స్థానం లో  ఇక్కడ ఎన్నెన్నో అంతస్తులు కలిగిన భవనాలు ఉన్న అవి ఏదొ  తెలియని కొత్త అందాన్ని తెచ్చి పెట్టేవి. కానీ అదికంగా ఉన్న కృత్రిమ కాంతి వాళ్ళ చాలా నక్షత్రాలు స్పష్టం గా కనపడేవి కాదు.అయిన కష్టపడి కాంతి లేని చోటు చూసుకుని నక్షత్రాలని గమనించే వాడు. వాటి గురించి ఎన్నో విషయాలు సేకరించినా ఎదో కొత్త సందేహం తనని వెంటాడుతూనే ఉండేది.


అలా కొనాళ్ళు గడిచిన తరువాత తన పనివేళలు ఉదయానికి మార్చారు. ఆ మార్పు గౌతమ్ జీవితం లో ఒక మలుపు కి  నాంది పలికింది. గౌతమ్ కి చిన్నప్పటి నించి పెద్దగా స్నేహితులు ఎవరు లేరు. ఉద్యోగం లో చెరాక కొంతమంది తో పరిచయం ఏర్పడినా అది పరిచయం గానే ఉండిపోయింది. ఎప్పటి లానే ఫలహారం తినేసి తన క్యాబిన్ దగ్గరకి వెళ్ళిన గౌతమ్, ఒక అమ్మాయి తన కుర్చీ లో కూర్చుని ఉండటం గమనించాడు. తనని పలకరించి ఇంకో కుర్చీ ఇచ్చి లేవమని అడిగి ,తన పని మొదలు పెట్టాడు. ఈ లోపు గౌతమ్ వాళ్ళ పై అధికారి వచ్చి కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి ని గౌతమ్ కి మిగిలిన వాళ్ళకి పరిచయం చేసాడు. ఆ అమ్మాయి పేరు తార. ఆకాశం లో ఉన్న నక్షత్రం లా మిరుమిట్లు గొలిపే కళ్ళతో ఎంతో ఆకర్షనీయం గా ఉంటుంది. చంద్రుడికి మచ్చ ఉన్నట్టు తార కి కళ్ళజోడు ఉన్నా  అది ఆ అమ్మాయి ముఖ సౌందర్యాన్ని ఏ మాత్రం తగ్గించ లేదు. తనతో పనిచేసే వాళ్ళలో ఎంతో మంది అందమైన  అమ్మాయిలని పట్టించుకోని గౌతమ్, తార ని కూడా పట్టిచుకోకుండా పని చేసుకోసాగాడు.

No comments:

Post a Comment